
ysrcp
రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సజావుగా జరగాలని వైఎస్సార్ సీపీ నాయకులు దేవుళ్లను వేడుకున్నారు. దసరా సందర్భంగా దేవాలయాలకు వెళ్లి కొబ్బరి కాయలు కొట్టి మొక్కుకున్నారు. సీఎం జగన్ పాలన, అభివృద్ధి వికేంద్రీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 3 రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఆ లక్ష్యం కోసం వైసీపీ నేతలంతా ఆలయాలకు వెళ్లి కొబ్బరి కాయలు నివేదించి ప్రార్థించారు.
దసరా సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు వైసీపీ శ్రేణులు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మూడు రాజధానులు ఏర్పాటు కావాలని కొబ్బరి కాయలు కొట్టి భగవంతుని ప్రార్థించారు.
ఇప్పటికే ప్రజల్లో బలంగా వినిపిస్తున్న వాదన మూడు రాజధానులు. విశాఖపట్నం విద్యార్థుల జేఏసీ ధర్నా చేసి తమ ఉద్దేశ్యాన్ని వెల్లడించింది. విజయదశమి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తమ ఆకాంక్ష విజయవంతం కావాలని తమ కోరికలను అమ్మవారి ముందుంచారు.
ఈ క్రమంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్ధతుగా నిలుస్తూ పార్టీ శ్రేణులు బలంగా కోరుకుంటున్నారు. ఈ మేరకు గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలు గిద్దలూరులోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం, నియోజకవర్గ ఇన్చార్జి ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు 1001 కొబ్బరికాయలు కొట్టారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఆలయం వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు.
పార్టీ నాయకులు చెన్ను విజయ, బి బాలరెడ్డి, సి.బాలనాగిరెడ్డి, ఎం గురుప్రసాద్తో పాటు పలువురు హాజరయ్యారని సమాచారం. యాత్ర విజయవంతం కావడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని వైఎస్ జగన్ తిరుపతిలోని తిరుమల ఆలయంలో ప్రార్థనలు కూడా చేశారు.
దసరా పండుగ సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేసిన 1001 కొబ్బరికాయల కొట్టే ప్రక్రియకు ప్రత్యేకత సంతరించుకుంది.