
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవటీకరించేందుకు ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) త్రీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ పథకాన్ని ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగించడం ద్వారా, ఆ పథకం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ప్రయోజనాలు నష్టపోతారని వైసీపీ పార్టీ హెచ్చరించింది.
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఆరోగ్యశ్రీ పథకం ప్రజలకు ప్రాణవాయువు లాంటి పథకంగా మారింది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ పథకాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు అమలు చేసి ప్రశంసించాయి. దీన్ని ప్రైవటీకరించేందుకు ఏదైనా ప్రయత్నం చేసినా, ప్రజలు అడ్డుకునే స్థాయిలో ప్రాధమికంగా నిరసన వ్యక్తం చేస్తారు” అని అన్నారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగించడం వల్ల, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారని గోపిరెడ్డి తెలిపారు. “ప్రైవేట్ బీమా కంపెనీలు తమ నియమాలు, షరతుల ఆధారంగా పనిచేస్తాయి. ప్రభుత్వానికి ఏమీ చెప్పే అవకాశం ఉండదు. ఇది మెడికల్ సిస్టమ్‌ను దెబ్బతీయవచ్చు మరియు సంక్షేమ పథకం మొత్తం పేదలకు సహాయపడకుండా చేయవచ్చు” అని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వం “సూపర్ సిక్స్” హామీని నెరవేర్చేందుకు సరిపడా చర్యలు తీసుకోలేకపోతుందని, అదే విధంగా బీమా కంపెనీలకు ప్రీమియంలు చెల్లించడంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని, ఆరోగ్యశ్రీ పథకం దెబ్బతినే అవకాశముందని ఆయన అన్నారు.
“రెండు లక్షల 50 వేలు వరకు బీమా కంపెనీ చెల్లించి, మిగతా రూ. 2.5 లక్షలు ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లించడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రజలకు చాలా సమస్యలు తలెత్తుతాయి. కొన్ని కేసుల్లో కోక్లియర్ ఇంప్లాంట్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ వంటి సేవలకు వేచి ఉండాల్సి వస్తుంది” అని గోపిరెడ్డి చెప్పారు.
ప్రైవేట్ బీమా కంపెనీలు అధిక ధరలు పెంచడం మరియు తప్పు కారణాలతో క్లెయిమ్‌లు తిరస్కరించడం మానవత్వాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం వలన ప్రజలకు సమస్యలు ఎదురవుతాయని ఆయన తెలిపారు.
గోపిరెడ్డి, “ఆరోగ్యశ్రీకి రూ. 3,000 కోట్ల బకాయిలను తీర్చాలని, పాత విధానాన్ని కొనసాగించాలని, ప్రీమియం చెల్లించడంలో మరియు పథకంలో చెల్లించే మొత్తం మధ్య పెద్ద తేడా లేదని చెప్పారు.”
అలాగే, “10,032 గ్రామాలు క్లినిక్స్ దాదాపు పని చేయకుండా పడి ఉన్నవి, 17 కొత్త ఆసుపత్రులు ప్రైవటీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం దీని నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది” అని ఆయన ఆరోపించారు.