
ysrcp ministers and leaders slams janasena pawan kalyan over his abusive comments
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముసుగు తొలగిందని.. చంద్రబాబుతో లగ్నం చేసుకోవడానికి ముహూర్తం దగ్గరపడిందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. రాజకీయ ముఖచిత్రం మారడమని పవన్ పేర్కొనడం చంద్రబాబుతో కలిసి వెళ్తున్నానని చెప్పడమేనన్నారు. పవన్ ముసుగు వెనుక చంద్రబాబుకు గులాంగిరీ ఉందనేది తేలిపోయిందన్నారు. ఒక రాజకీయ పార్టీ పెట్టి.. 175 స్థానాల్లో ఒక్కచోట కూడా అభ్యర్థిని నిలబెట్టలేదు కాబట్టే తాము ప్యాకేజీ స్టార్ అని విమర్శించామన్నారు. జనసేన మొత్తం 175 సీట్లలో పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్ అనడం మానేస్తామన్నారు.
పవన్ కల్యాణ్ ఒక ఉన్మాది… : మంత్రి కొట్టు సత్యనారాయణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ఒక ఉన్మాదిలా మాట్లాడాడని మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ‘పవన్ కల్యాణ్ ఉన్మాదిలా మాట్లాడాడు. రంగా హత్యకు కాపులు, బలిజలు బాధ్యత వహించాలా.. రంగాను హత్య చేసింది టీడీపీ కాదా.. అని ప్రశ్నించారు. ముద్రగడ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కుడున్నావ్.. కనీసం విచారం తెలిపావా.. అని నిలదీశారు. ప్రతీ విషయంలో పవన్ ప్యాకేజీ బయటపడుతూనే ఉందన్నారు.
ముసుగు దొంగ.. నిజ స్వరూపం ఇదే : మంత్రి జోగి రమేష్
పవన్ కల్యాణ్ ముసుగు దొంగ అని.. ఆయన నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్.. ప్యాకేజీ కల్యాణ్. ప్యాకేజీకి అమ్ముడుపోయే వాడే పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. 2019లో ప్రజలు చెప్పులు అరిగేటట్లు కొట్టినా బుద్ది రాలేదన్నారు. చెప్పుతో కొడుతానని పవన్ కల్యాణ్ అంటున్నారని… ఆ చెప్పు అయినా నీదేనా లేక నీ యజమానిదా.. అని ప్రశ్నించారు. విశాఖ గర్జన సక్సెస్ను జీర్ణించుకోలేకనే కర్రలు, రాళ్లతో మంత్రులపై దాడి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణే కాదు.. ఇంకా ఎంత మంది కలిసొచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇంచు కూడా కదిలించలేరని అన్నారు. మేం తలుచుకుంటే పవన్ కల్యాణ్ ఒక లెక్క కాదని అన్నారు.
పీకే అంటే ప్యాకేజీ కల్యాణ్ : మంత్రి అమరనాథ్
పీకే అంటే పిచ్చి కుక్క, ప్యాకేజీ కల్యాణ్, పెళ్లిళ్ల కల్యాణ్ అంటూ మంత్రి అమరనాథ్ ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఆయన విలన్ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. రాక్షసులు ఎంత మంది కలిసొచ్చినా తమ విజయాన్ని ఆపలేరని అన్నారు. అంతా ఊహించినట్లుగానే పవన్ కల్యాణ్ ముసుగు తొలగిపోయిందని.. మళ్లీ టీడీపీతో జతకట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు.