
unstoppable season 2
అన్ స్టాపబుల్ షోతో దెబ్బకు థింకింగ్ మారిపోయేలా చేశారు నందమూరి బాలకృష్ణ. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ టాక్ షో విశేష ఆదరణ పొందుతోంది. మొదటి సీజన్ ను సినిమా స్టార్స్ తో అలరించిన బాలయ్య.. రెండో సీజన్ కు పోలిటికల్ టచ్ ఇస్తున్నారు. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ కు టీడీపీ అధినేత చంద్రబాబును తీసుకొచ్చి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన బాలయ్య.. తాజా ఎపిసోడ్ కు మరో పొలిటికల్ స్టార్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట.
రెండో సీజన్ లో నాలుగో ఎపిసోడ్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కూతురు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్య అతిథిగా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ ఇదే నిజమైన..సంచలన విషయమే అని చెప్పాలి.
ఏపీ రాజకీయాల్లో నందమూరి, వైఎస్ కుటుంబాలు రాజకీయ విరోధులనే విషయం అందిరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలో షర్మిల పాల్గొనడం.. రాజకీయంగా జగన్ కాస్త ఇబ్బంది పెట్టే అంశమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వాస్తవానికి వైఎస్ షర్మిల, సీఎం జగన్ మధ్య చాలా కాలం క్రితం మనస్పర్థలు వచ్చినట్లు అందిరికీ తెలిసిన విషయమే. ఓపెన్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని షర్మిల బహిరంగంగానే చెప్పారు. అన్నకు దూరమైన తర్వాత.. తెలంగాణలో పార్టీ పెట్టుకొని.. తన రాజకీయ భవిష్యత్ కు పునాదులు వేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. ఈ క్రమంలో తన రాజకీయ ఎదుగుదలకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అందులో భాగంగానే.. ఏబీఎన్ రాధాకృష్ణ షోకు వెళ్లారు. ఇప్పుడు కూడా.. అన్న మీద కోపంతోనే.. లేక.. తన రాజకీయ వ్యూహంలో భాగంగానో.. బాలయ్య షోలో పాల్గొనేందుకు అంగీకరించారట షర్మిల. అయితే ఈ విషయం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.