
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమం పులివెందుల క్యాంపు కార్యాలయంలో నిర్వహించబడగా, రాయలసీమ జిల్లాల నలుమూలల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల వినతి పత్రాలను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హాజరయ్యారు. కాసేపటి క్రితమే ప్రారంభమైన ఈ కార్యక్రమం జనసంద్రంగా మారింది.
వైఎస్ జగన్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వారికి పరిష్కార మార్గాలు సూచించడం ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం. రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమానికి విశేష స్పందన చూపుతున్నారు.