
డబ్బు చేతిలో ఉంటే ఖర్చు అవుతుంది. అదే ఎల్ఐసీ పాలసీలో పెట్టుబడి పెడితే.. ఆదా అవడంతో పాటు మన భవిష్యత్తు ఆర్థిక చింతన లేకుండా తయారవుతుంది. అందులో భాగంగా ఎల్ఐసి జీవన్ ప్రగతి యోజన అనేది భవిష్యత్తును ఆర్థిక చింతలు లేకుండా చేయడానికి ఒక మంచి పాలసీ. ఇది పదవీ విరమణకు కూడా సహాయపడుతుంది. ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.
ఈ పాలసీలో రోజుకు రూ.200 ఆదా చేసుకోవాలి. ఇలా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే రూ.28 లక్షల భారీ మొత్తం వస్తుంది. పెట్టుబడి పెట్టిన మొదటి ఐదేళ్ల వరకు రిస్క్ కవర్ అలాగే ఉంటుంది. 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు బీమా రిస్క్ కవర్ 25 నుండి 125 శాతానికి పెరుగుతుంది. 11 నుండి 15 సంవత్సరాల వరకు రిస్క్ కవర్ 150 శాతానికి పెరుగుతుంది. 20 సంవత్సరాలు చెల్లించి, మధ్యలో డబ్బును విత్డ్రా చేసుకోకుంటే, మీకు 200 శాతం రిస్క్ కవర్ లభిస్తుంది.
ఒక వ్యక్తి రూ.2 లక్షలకు పాలసీ తీసుకుంటే, మొదటి ఐదేళ్లపాటు బీమా కవరేజీ అలాగే ఉంటుంది. తర్వాత 6-10 మధ్య రూ.2.5 లక్షలు. అలాగే 11-15 ఏళ్ల మధ్య రూ.3 లక్షలు. 16-20 సంవత్సరాల వయస్సు గల వారికి బీమా కవరేజీ సుమారు రూ. 4 లక్షలు. ఉంటుంది.