
pawan kalyan and ali
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్- కమెడియన్ అలీ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019 ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లో అలీ నటించాడు. అయితే ఆ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు.. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయి. ఫలితంగా అప్పటి నుంచి పవన్ సినిమాల్లో అలీ కనిపించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే.. 2019 ఎన్నికల తర్వాత పవన్ -అలీ ఒక్కసారి కూడా కలుసుకోలేదు.
అయితే తాజాగా పవన్ కల్యాణ్- అలీ కలయికపై ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ఓ సినిమా ప్రమోషన్ లో అలీ చేసిన వ్యాఖ్యలు.. ఈ చర్చకు కారణం అయ్యాయి.
అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ తెలుగు నాట చాలా పాపులర్. ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారం అయ్యే.. ఈషోలో టాలీవుడ్ ప్రముఖులను ఆలీ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలను కొన్ని లక్షల మంది ఫాలో అవుతుంటారు. అయితే ఈ షోకు పవన్ కల్యాణ్ ఎప్పుడు వస్తారని సినిమా ప్రమోషన్ లో అలీని అడగ్గా.. ఆయన స్పందించారు. పవన్ కల్యాణ్ కూడా షోకు కచ్చితంగా వస్తారని, ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారని చెప్పారు.
గత ఎన్నికల్లో స్నేహితుడైన అలీ.. తన వెంట లేకుండా.. వైసీపీలో చేరడంపై పవన్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అప్పటి నుంచి అలీని పవన్ దూరం పెట్టారు. ఆ తర్వాత పవన్ నటించిన బీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాల్లో కూడా అలీ నటించలేదు. ఇద్దరి మధ్య స్నేహం వికటించడం వల్లే.. పవన్ సినిమాల్లో అలీ కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ రాజకీయ విభేదాల మధ్య.. అలీ షోకు పవన్ వస్తారా? అంటే.. కాస్త అనుమానమే అని చెప్పాలి. పైగా తాజాగా అలీని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇప్పటి నుంచి పవన్ అధినేత గా ఉన్న పవవ్ కు వ్యతిరేకంగా అలీ పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. ముఖ్యంగా ఎన్నికల దగ్గరకొస్తున్న నేపథ్యంలో.. అలీ షోకు పవన్ రావడం అసాధ్యమనే చెప్పాలి.