
amaravati capital
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. అధికార వికేంద్రీకరణ జరిపి తీరుతామని చెబుతోంది ప్రభుత్వం. మరి మూడు రాజధానులు కాకుండా అడ్డుకుంటన్నది ఎవరు? అమరావతినే రాజధాని చేయాలని టీడీపీ పదే పదే అనడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? పాదయాత్ర చేస్తున్న రైతుల వెనుక అమరావతి భూ అక్రమార్కులు ఉన్నారనడంలో నిజమెంత?
మూడు ప్రాంతాల అభివృద్ధి నినాదంతో వైసీపీ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల అవసరాన్ని తద్వారా కలిగే ప్రయోజనాలను వివరించింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులపై తమ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని తేల్చి చెప్పారు సీఎం జగన్. అంతేకాదు.. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ చర్యతో అధికార వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తుందని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇతర పార్టీలు కూడా టీడీపీకి వంత పాడుతున్నాయి. మరోవైపు అమరావతి రైతుల పేరుతో కొందరు పాదయాత్ర చేస్తున్నారు. స్వప్రయోజనాల కోసం వీరు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ‘చంద్రబాబు హయాంలో జరిగిన భూ అక్రమాల్లో మెజార్టీ వాటా టీడీపీ నాయకులదే. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి చంద్రబాబు స్కాములకు బీజం వేశారు. రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది చూసినా అవినీతికి ఆలవాలంగా మారింది’ అని వైసీపీ చెబుతోంది.
ఆనాడు చంద్రబాబు వల్ల లబ్ధి పొందిన వారు.. ఇన్ సైడ్ ట్రేడింగ్ లో భూములు పొందిన వారు మాత్రమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి రైతుల పేరుతో చేస్తున్న పాదయాత్ర వెనుక ఉన్నది కూడా వారే అని ప్రచారం జరుగుతోంది. ఇన్ సైడ్ ట్రేడింగ్ లో భూములు కొన్నవారి జాబితాలో ఇతర పార్టీల నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఇతర పార్టీ లు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
అమరావతి రైతుల పైరుతో చేస్తున్న పాదయాత్రలో నిజమైన రైతులు రైతులు లేరని ప్రభుత్వం చెబుతోంది. ఇన్ సైడ్ ట్రేడింగ్ లో భూములు కొన్న భూస్వాములే పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసానికి చాలా మంది రాజధాని రైతులు బలయ్యారు. నిజానికి చంద్రబాబు చేతిలో మోసపోయిన రైతులను జగన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఆంటోంది.