
వినియోగదారులకు చేరువయ్యేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిత్యం ప్రత్నిస్తుంటుంది. తాజాగా వాట్సాప్ యూజర్లకు ఒక శుభవార్త చెప్పింది. వినియోగదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న.. ఒక సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది.
కొత్తగా తీసుకొచ్చే ఫీచర్ తో.. డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందవచ్చని వివరించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగ దశలో ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు వాట్సాప్ యాజమాన్యం ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అన్ని కుదిరితే.. ఓఎస్ వెర్షన్ ఫోన్లలో కూడా దీన్ని ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం వాట్సాప్‌లో తొందరపాటువల్ల ఏదైనా మెసేజ్ లేదా మీడియా ఫైల్‌ను డిలీట్ చేస్తే వాటిని పొందడానికి అవకాశం లేదు. కొత్త ఫీచర్ తో ఆ సమస్య తీరనుంది. చాలా కాలంగా వినియోగదారులు ఈ ఫీచర్ కోసం ఎదురు చూస్తున్నారు. అనేక రిక్వెస్టులు సైతం.. వాట్సాప్ యాజమాన్యానికి పంపారు.
కొత్త ఫీచర్ పని తీరు ఎలా ఉంటుందంటే.. యూజర్లు మెసేజ్ డిలీట్ చేసిన వెంటనే.. స్క్రీన్ పైన అన్డూ ఆప్షన్ కనిపిస్తుంది. అన్‌డూపై క్లిక్ చేస్తే డిలీట్ చేసిన మెసేజ్ తిరిగి చాట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.