
ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు (AIMPLB) వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముస్లింల మతపరమైన హక్కులపై ఇది దాడిగా భావిస్తున్నామని, ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించనున్నట్లు AIMPLB ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాలు కూడా ప్రభుత్వ ఇఫ్తార్‌ను బహిష్కరించాలని కోరింది.
AIMPLB సభ్యులు మాట్లాడుతూ,
-
వక్ఫ్ బిల్లులో పారదర్శకత లేకుండా ముస్లింలపై కుట్ర జరుగుతోంది.
-
మతపరమైన వ్యవహారాలను ఆయా మతాలే నిర్వహించుకోవాలి, ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు.
-
సనాతనధర్మం బోర్డులో ఇతర మతాలను కలపాలని చూస్తే, మేమే ముందుగా పోరాడతాం.
-
ప్రతీ మతానికి తమ భూములను రక్షించుకునేందుకు బోర్డులు ఉన్నాయి, ముస్లింలకు మాత్రమే బోర్డు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం తప్పు.
-
వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల హక్కులను హరించేందుకు తీసుకొచ్చిన కుట్రపూరిత చర్య.
ఈనెల 29న విజయవాడలో భారీ నిరసన
AIMPLB ఈనెల 29న విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.