
వైఎస్సార్సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి వ్యక్తిగత కారణాలతో రాజ్యసభకు రాజ్యసభకు , రాజకీయాలకు విజయసాయిరెడ్డిరాజీనామా చేశారు. మూడున్నర సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉన్నా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిసి తన రాజీనామా సమర్పించారు.
విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశాను. రాజ్యసభ చైర్మన్ దానిని ఆమోదించారు,” అన్నారు.
ఈ నిర్ణయంతో వైఎస్సార్సీపీ నేతలు ఆయనను రాజకీయాల్లో కొనసాగాలని అభ్యర్థించారు. పార్టీ నాయకుడు మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, “అనుభవజ్ఞులైన నేతలు పార్టీకి అవసరం. జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే మనందరం కలిసి పని చేయాలి. విజయసాయిరెడ్డి గారు రాజకీయాల్లో కొనసాగాలి,” అని విజ్ఞప్తి చేశారు.
విజయసాయిరెడ్డి స్పందిస్తూ, “దీనిపై ఆలోచించి మాట్లాడతాను,” అని తెలిపారు. మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి విజయసాయిరెడ్డి సేవలను ప్రశంసిస్తూ, “పార్టీకి ఆయన కీలకమైన నేత. ప్రతిపక్షాల విమర్శలను ధైర్యంగా ఎదుర్కొన్నారు,” అని తెలిపారు.
వైఎస్సార్సీపీ నేతలు విజయసాయిరెడ్డి నిర్ణయం పునరాలోచన చేయాలని కోరుతూ, ఆయన సేవలను కొనసాగించాలని ఆశిస్తున్నారు.