
United Nations Future Economy Leadership Award for ap
ఈజిప్టులో నవంబర్ 5 -6 రోజుల్లో నిర్వహించినటువంటి ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (CoP27) లో ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ (RySS) 2022 కి ప్రతిష్టాత్మకమైన ‘ఫ్యూచర్ ఎకానమీ లీడర్షిప్ అవార్డు’ లభించింది.
ఆంధ్రప్రదేశ్లో సేంద్రీయ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో రైతు సాధికర సంస్థ కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రైతు సాధికర సంస్థ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF) సూత్రాలను అమలు చేస్తోంది. సంస్థ తరపున, పునరుత్పత్తి వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న విజయ్ కుమార్..సెమినార్లో ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యకు సంబంధించిన సేవల్లో చాలాసార్లు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిన విషయం తేలిసిందే. అయితే ఇదే సెప్టెంబర్ లో రైతు సాధికర సంస్థకు సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంతో ‘జైవిక్ ఇండియా అవార్డ్స్, ఆర్గానిక్ ఫుడ్ ఇండియన్ కాంటెస్ట్ 2022’ లాంటి పాన్ ఇండియా అవార్డు కూడా లభించింది