
Properties of Tirumala Tirupati Devasthanam
శ్రీవారి ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పష్టం చేసింది. టీటీడీ బోర్డు ఆమోదించిన విధివిధానాల ప్రకారమే బ్యాంకుట్లో డిపాజిట్లు చేసినట్లు టీటీడీ పేర్కొంది. ఈ మేరకు శ్రీవారి ఆస్తులకు సంబంధించి శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది టీటీడీ.
దీనిలో భాగంగా శ్రీవారికి మొత్తం బ్యాంకుల్లో రూ. 15, 938 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపిన టీటీడీ.. శ్రీవారికి 10,258.37 కేజీల బంగారం ఉన్నట్లు పేర్కొంది. 24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసినట్లు టీటీడీ తెలిపింది. గత మూడేళ్లలో స్వామి వారి నగదు, డిపాజిట్లు భారీగా పెరిగినట్లు తెలిపింది టీటీడీ.
బంగారం రూపంలోనే శ్రీవారికి భారీ మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది. 10,258.37 కేజీల బంగారం విలువ దాదాపు రూ.50వేల కోట్లు ఉండే ఉంటుంది. ఇంకా స్వామివారికి చెందిన భూములు.. ఇతర ఆస్తుల వివరాలను పూర్తిగా లెక్కగడితే.. దాదాపు రూ. లక్ష కోట్లకు చేరినా.. ఆశ్చర్యపోనవసరం లేదు.