
ttd
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో టీటీడీ ధర్మకర్తల మండలి అందులో కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించింది. అలాగే ఏర్పాట్లపై కూడా మండలిలో సుధీర్ఘంగా చర్చ జరిగంది. మండలి భేటీ ముగిసిన తర్వాత టీటీటీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్ణయాలను వెల్లడించారు.
తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేశామని.. ప్రయోగాత్మకంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బ్రేక్ దర్శనాలు ఉంటాయన్నారు.
బ్రహ్మోత్సవాల అనంతరం టైమ్‌స్లాట్ టోకెన్ల జారీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నారని.. ప్రాథమికంగా రోజుకు 20వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు. తిరుమల గదుల కేటాయింపులోనూ మార్పులు చేసినట్లు చెప్పారు. తిరుమలలో వసతి గదుల కేటాయింపు తిరుపతిలోనే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.