
ఆంధ్రప్రదేశ్ అనకపల్లి జిల్లాలోని టాగోర్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మంగళవారం జరిగిన విష గ్యాస్ లీక్‌లో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోగా, 20 మంది అస్వస్థతకు గురయ్యారు. హైడ్రోజన్ క్లోరైడ్ (HCL) మరియు క్లోరోఫార్మ్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది.
400 లీటర్ల హెచ్‌సీఎల్ లిక్విడ్ రియాక్టర్-కమ్-రిసీవర్ ట్యాంక్ (GLR-325) నుంచి లీక్ అయి కింద పడింది. రాత్రి సమయానికి 9 మంది శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు వంటి లక్షణాలను కార్మికులు గమనించారు .
విష ప్రభావితులను గాజువాకలోని పవన్ సాయి ఆస్పత్రికి తరలించగా, ముగ్గురిని అనంతరం విశాఖపట్నం శీలనగర కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 23 ఏళ్ల అమిత్ అనే సహాయకుడు చికిత్స పొందుతూ మరణించగా, మరో ఇద్దరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మిగతా ఆరుగురు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు.