
శ్రీవారి ఆలయం ఎదుట బూతుల వర్షం – భక్తులు షాక్
గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన పవిత్ర తిరుమల ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యుడు అర్హించని ప్రవర్తన ప్రదర్శించి భక్తులను ఆశ్చర్యానికి గురిచేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యుడు అసభ్య పదజాలంతో ప్రవర్తించి వివాదానికి తెర తీశారు.
శ్రీవారి ఆలయం ముందు భక్తులు సంస్కారపూర్వకంగా ప్రార్థనలు నిర్వహించే సమయంలో, మహాద్వారం గేటు నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని టీటీడీ ఉద్యోగి చెప్పడంతో నరేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఏమనుకుంటున్నావ్? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ఇక్కడ థర్డ్ క్లాస్ వ్యక్తులను ఎవరు ఉంచారు?” అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, “ఎవడ్రా నువ్వు? బయటికెళ్లి చూడు… థర్డ్ క్లాస్ నా కొడకా! ముందు వెళ్ళిపో!” అంటూ నిందిత పదజాలంతో విరుచుకుపడ్డారు.
తిరుమల పవిత్ర ప్రాంగణంలో ఇటువంటి ప్రవర్తన అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి నుంచి రావడం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. భక్తులు టీటీడీ యాజమాన్యం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.