
sangam barrage
సింహపురి వాసుల దశాబ్దాల కల నెరవేరింది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి నిర్మాణాలతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రైతాంగం, ప్రజానికం నిరీక్షణ ఫలించింది. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసుకున్న మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజీలతో దాదాపు 5లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు.. సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. మంగళవారం సీఎం జగన్ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించి.. జాతికి అంకింతం ఇచ్చారు. ఈ ప్రాజెక్టులు ప్రారంభమైన నేపథ్యంలో వాటి గురించిన సమాచారం మీకోసం..
బ్రిటీష్ హయాంలో..
బ్రిటీష్హయాంలో సుమారు 100 ఏళ్ళ క్రితం నిర్మించిన సంగం, నెల్లూరు బ్యారేజీలు పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకోవటంతో ఆయకట్టు కనిష్ట స్థాయికి పడిపోయింది. కొన్ని వేల కుటుంబాల రైతులు సంగం బ్యారేజీ పునర్నిర్మాణం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2006 మే 28న సంగం బ్యారేజ్ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
2008 లో పనులు ప్రారంభమై.. శరవేగంగా కొనసాగిన పనులు వైఎస్సార్హఠాన్మరణంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ బ్యారేజ్ పనులు నత్తనడకన సాగాయి. ఆ తర్వాత సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో బ్యారేజ్ పనులు ఊపందుకున్నాయి.
ఆకస్మిక మరణానికి గురైన దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. సీఎం జగన్ సహకారంతో బ్యారేజి పనులు శరవేగంగా పూర్తయ్యేందుకు పాటుపడ్డారు గౌతం రెడ్డి. బ్యారేజి పూర్తి కావడానికి చేసిన సేవలకు గానూ మేకపాటి గౌతంరెడ్డి మరణానంతరం సంగం బ్యారేజీకి ఆయన పేరును నామకరణం చేశారు.
పెన్నానది వరద ముప్పునకు ఫుల్‌స్టాఫ్
సంగం, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం వల్ల సోమశిల ప్రాజెక్టు వరద ప్రవాహాన్ని ఎక్కడికక్కడ నియంత్రిచడానికి అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పెన్నానది లోతట్టు ప్రాంతాల ముప్పునకు శాశ్వత పరిష్కారం లభించింది. వరద ముప్పును తప్పించేందుకు అడ్డుకట్టలుగా రెండు బ్యారేజీలు నిలవనున్నాయి. పెన్నానదికి వరదలు వస్తే వణికిపోయే నెల్లూరు నగర లోతట్టు ప్రాంత ప్రజలు ఇక నిశ్చింతగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజి..
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నాసోమశిల రిజర్వాయర్‌కు 40 కి.మీ. దిగువన నిర్మాణం
- 50,122 చదరపు కిలోమీటర్లు పరీవాహక ప్రాంతం
- బ్యారేజ్పొడవు 1,195 మీటర్లు
- 85 గేట్లు(12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు.. 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 స్కవర్స్లూయిజ్గేట్లు)
- గేట్ల మరమ్మతుల కోసం 9 స్టాప్లాగ్గేట్లు
- గేట్ల నిర్వహణ కోసం వర్టికల్లిఫ్ట్విధానం
- గరిష్ట వరద విడుదల సామర్థ్యం 7,50,196 క్యూసెక్కులు
- గరిష్ట నీటి మట్టం 35 మీటర్లు
- గరిష్ట నీటి నిల్వ 0.45 టీఎంసీలు
- కనీస నీటి మట్టం 32.2 మీటర్లు
- ఆయకట్టు 3.85 లక్షల ఎకరాలు
- అంచనా వ్యయం రూ.335.80 కోట్లు
- వైఎస్సార్‌హయాంలో రూ.30.85 కోట్ల వ్యయం
- టీడీపీ హయాంలో రూ.86.10 కోట్ల వ్యయం
- వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం రూ.131.12 కోట్లు
నెల్లూరు బ్యారేజి
- నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నానదిపై మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌కు 20 కి.మీ. దిగువన నిర్మాణం
- 51,800 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం
- బ్యారేజ్పొడవు 640 మీటర్లు
- 51 గేట్లు (పది మీటర్లు ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు.. పది మీటర్లు ఎత్తు,
4.3 మీటర్ల ఎత్తుతో ఎనిమిది స్కవర్స్లూయిజ్గేట్లు) - గేట్ల మరమ్మతుకు 6 స్టాప్లాగ్గేట్లు
- వర్టికల్లిఫ్ట్విధానంలో గేట్ల నిర్వహణ
- గరిష్ట వరద విడుదల సామర్థ్యం 10,90,000 క్యూసెక్కులు
- గరిష్ట నీటి మట్టం 14.3 మీటర్లు
- గరిష్ట నీటి నిల్వ 0.4 టీఎంసీలు
- కనీస నీటి మట్టం 11.3 మీటర్లు
- ఆయకట్టు 99,525 ఎకరాలు
- అంచనా వ్యయం రూ.274.83 కోట్లు