
AP cm jagan
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ధోకా ఏమీ లేదని సీఎం జగన్ అన్నారు. అవాస్తవాలను రాష్ట్ర ప్రజలు ఏవరు నమ్మనమ్మవద్దన్నారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ వివరణ ఇచ్చారు. రాష్ట్ర అప్పులపై చంద్రబాబు రోజూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. విభజన నాటికి రాష్ట్రం రుణాలు రూ.1.26 లక్షల కోట్లు అని తెలిపారు జగన్. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అవి రూ.2.69 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించారు.
“చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 123 శాతం అప్పులు పెరిగాయి. ఈ మూడేళ్లలొ రూ.3.82 లక్షల కోట్లకు రుణాలు చేరాయి. వైసీపీ హయాంలో 41.83 శాతం మాత్రమే రుణాలు పెరిగాయి. మూడేళ్లలో రాష్ట్రం చేసిన అప్పులు 12.73 శాతం మాత్రమే. ప్రభుత్వ గ్యారంటీతో చంద్రబాబు హయాంలోనే ఎక్కువ అప్పులు చేశారు. 2014లో ప్రభుత్వ గ్యారంటీతో రూ.14,028 కోట్ల రుణాలు తీసుకున్నారు. చంద్రబాబు దిగిపోయే నాటికి ప్రభుత్వ గ్యారంటీ రుణాలు రూ.59,257 కోట్లకు పెరిగాయి.” – అసెంబ్లీలో సీఎం జగన్
చంద్రబాబు హయాంలో రుణాలు 144 శాతం పెరిగినట్లు చెప్పారు సీఎం జగన్. ఈ మూడేళ్లలో ప్రభుత్వ గ్యారంటీ రుణాలు రూ.1. 71 లక్షల కోట్ల అని, గత అప్పుతో కలుపుకుంటే రూ.4.99 లక్షల కోట్లకు రుణాలు పెరిగాయన్నారు.
మండలిలో తీవ్ర వాగ్వాదం..
ప్రశ్నోత్తరాల సమయంలో మండలిలో అధికార పక్షం, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని అధికార పార్టీ సభ్యులు చెప్పగా.. నారా లోకేశ్ తోపాటు మరికొంత మంది టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఆ మాట ఎక్కడ అన్నారో చూపించాలని అధికార పక్షానికి సవాల్ విసిరారు లోకేశ్. ఆ మాటలను నిరసన గా పోడియం చుట్టుముట్టారు టీడీపీ ఎమ్మెల్సీలు.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కనీసం విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని చెత్త ప్రభుత్వం, ఆర్బీకే లు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు.