
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, ఆర్.బి. చౌదరి నిర్మించిన ఈ సినిమాకు చరణ్ నిర్మాణ భాగస్వామి. అయితే ఈ సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతంది. అక్టోబర్ 5న ఈ సినిమాను దసరా కానుకగా.. విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఆ రోజున ఈ సినిమా విడుదలయ్యే అవకాశం లేదనీ, రిలీజ్ డేట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ రెండు రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ అయితే ప్రచారంపై చిత్రబృందం స్పందించింది.
గాడ్ ఫాదర్ సినిమా విడుదల తేదీ మారడం లేదని తేల్చి చెప్పింది చిత్రబృందం. ముందు చెప్పినట్లుగానే అక్టోబర్ 5వ తేదీనే విడుదల కానుందని స్పష్టం చేశారు. నయనతార పాత్రను పరిచయం చేసే పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. మలయాళంలో ఆ మధ్య వచ్చిన మోహన్ లాల్ ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. అవినీతి రాజకీయాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ .. సత్యదేవ్ .. సముద్రఖని .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.