
Dream house
- దివ్యాంగుడి సొంతింటి కల సాకారం
- ఇంటి వద్దకే పట్టాను చేర్చిన ప్రభుత్వం
సొంతింటి కోసం ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఓ దివ్యాంగుడి సొంతింటి కలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాకారం చేసింది. ’పేదలందరికీ ఇళ్లు‘ పథకంలో భాగంగా సీఎం జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాను స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు దివ్యాంగుడి ఇంటి వద్దకే వెళ్లి అందించారు. సొంతింటి కోసం కొన్నేళ్లుగా తపిస్తున్న దివ్యాంగుడి బాధలు ’గడప గడపకు మన ప్రభుత్వం‘ కార్యక్రమంతో తీరాయి.
ప్రతి ఒక్కరి మనసును కదిలించే ఈ సన్నివేశం కాకినాడలోని కిర్లంపూడి ఏనుగులవీధిలో జరిగింది. వైఎస్సార్ సీపీ స్థానిక నాయకుడు నాగబాబు అదే గ్రామానికి చెందిన దివ్యాంగుడికి బుధవారం నిర్వహించిన గడప గడపలో భూమి పత్రాలను అందించారు. ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న సలగల రాజబాబు అనే దివ్యాంగుడు ’గడప గడపకూ‘ కార్యక్రమంలో పర్యటిస్తున్న నాయకులకు తన బాధలను చెప్పుకొన్నారు. అతని పరిస్థితిని చూసి చలించిన స్థానిక నేత నాగబాబు వైఎస్సార్సీపీ వాలంటీర్లు వెంటనే ‘పేదలందరికి ఇళ్లు’ పథకంలో భాగంగా ఇంటి పట్టా మంజూరయ్యేలా దరఖాస్తు చేయించారు. మంజూరైన పత్రాలను రాజబాబు ఇంటికే వెళ్లి అందించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని నెలలుగా ‘గడప-గడపకు’ కార్యక్రమం జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. ప్రజా ప్రతినిధులు స్వయంగా ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల గురించి ఆరా తీయడం చాలా అరుదుగా జరిగే విషయం. ఎన్నికలు వస్తే కానీ కనిపించని నాయకులు ప్రభుత్వ పథకాలను అమలు చేయడమే కాకుండా అవి ప్రజల వద్దకు సరిగ్గా వెళ్తున్నాయి లేవా అనేది తెలుసుకోవడం ఎక్కడా కనిపించదు. అయితే ఇలాంటి సంఘటనలను తన పాదయాత్రలో, పర్యటనల్లో దగ్గరగా గమనించిన ముఖ్యమంత్రి జగన్ మదిలో మెదిలిన ఆలోచనే ’గడప గడపకూ మన ప్రభుత్వం‘ కార్యక్రమం. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా జరిగే పాలన మన కళ్ళ ముందే కనిపిస్తుందని చెప్పేందుకు ఈరోజు కిర్లంపూడి లో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. దివ్యాంగుడి ఇంటికి వెళ్లి పట్టాను అందించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.