
సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలోని మోండా మార్కెట్లో ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఆదివారం, అక్టోబర్ 13, స్థానికులు విషయాన్ని తేలుసుకోని , CCTV ఫుటేజీలో ఒక దుండగుడు విగ్రహాన్ని కాలితో తన్నడం మరియు ధ్వంసం రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో వైరల్‌గా మారడంతో హిందువుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సహా హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆలయాన్ని సందర్శించారు. హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులను నివారించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కిషన్ రెడ్డి ఆరోపించారు మరియు మత కలహాలు జరగకుండా భద్రతను పెంచాలని కోరారు. ఆలయం వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు, ఈ సందర్భంగా పలువురు బిజెపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.