
tdp
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంతో మొదలైన అధికార, ప్రతిపక్షాల ఆరోపణల పర్వం తారస్థాయికి చేరి, ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. టీడీపీ – వైసీపీ నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు పాత ఘటనలను తోడుకుంటున్నాయి. మహిళలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాష్టీకాలను తాజాగా తిరిగి బయట పెడుతోంది వైసీపీ. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలకు పాల్పడగా.. అధికారం కోల్పోయాక కూడా ఆ పార్టీ నాయకులు హత్యా రాజకీయాలకు పాల్పడిన ఘటనలను వెలుగులోకి తెస్తున్నారు. సీఎం జగన్ మహిళల కోసం ఎంతో కృషి చేస్తుంటే.. టీడీపీ నాయకుల అబలలపై దాడులకు పాల్పడుతున్నారంటూ చెబుతున్నారు. ప్రతిపక్షం ’డర్టీ పాలిటిక్స్‘ చేస్తోందని పలువురు నాయకులు మండిపడుతున్నారు.
టీడీపీ నాయకులు మహిళలపై దాడులకు పాల్పడిన పలు ఘటనలు ఇవీ..
2019 నవంబర్ 16: అనంతపురం జిల్లా చిలమత్తూరుకు చెందిన టీడీపీ కార్యకర్త శ్రీనివాస్ మహిళలను టార్గెట్ చేసి వేదింపులకు గురిచేయడమే కాకుండా ఆరుగురు మహిళలను అత్యాచారం చేశాడు.
2020 ఫిబ్రవరి 20: కర్నూల్ జిల్లా అవుకు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సభ్యసమాజం తలదించుకునేలా 14 ఏళ్ల బాలుడిపై పైశాచికంగా లైంగికదాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్త బుల్లెట్ రాజు.
2022 జనవరి 30:- 14ఏళ్ల బాలికపై లైంగిక వేదింపులకు పాల్పడి ఆమే ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన విజయవాడకు చెందిన టీడీపీ నేత వినోద్ జైన్.
2022 ఏప్రిల్ 28: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని. తన స్నేహితుడు శివసత్య సాయిరామ్ కోరికను కూడా తీర్చాలని ఆమెను వేధించాడు.
అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను దారుణంగా హత్యచేసిన టీడీపీ కార్యకర్త, నారా లోకేశ్ యూత్ టీమ్ సభ్యుడు కొర్రపాటి వెంకటసాయి సతీష్ చౌదరి.
2022 ఏప్రిల్ 29: బర్త్ డే విషెస్ చెప్పాలని బెదిరించి ఇంటికి పిలిపించుకుని మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన విశాఖకు చెందిన టీడీపీ నేత తోట నరేంద్ర
2022 జులై 10:అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గజిరెడ్డపాలెం గ్రామానికి చెందిన కూతురి వయసు ఉన్న మైనర్ బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు టీడీపీ నాయకుడు చేపల చిట్టిబాబు. ఇతను ఆ బాలికకు వరసకు పెదనాన్న.
మహిళలకు ప్రభుత్వం పెద్దపీట
టీడీపీ నాయకుల దాష్టీకాలను చాటి చెబుతూనే.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు నాయకులు. పలు పథకాల ద్వారా మిహిళలకు సీఎం జగన్ రూ.2.39 లక్షల కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. మహిళలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ ను సీఎం జగన్ కేటాయించినట్లు చెబుతున్నారు. అసెంబ్లీలో 15 మంది మహిళలుంటే అందులో 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కాగా.. చంద్రబాబు చివరి క్యాబినెట్ లో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులిస్తే.. జగన్ నలుగురు మహిళలకు మంత్రులుగా (హోంమంత్రి, డిప్యూటీ సీఎం తో సహా ) అవకాశం కల్పించినట్లు వైసీపీ చెబుతోంది.
13 జిల్లా పరిషత్ చైర్మన్లలో ప్రస్తుతం ఏడుగురు మహిళలు ఉన్నారు. వైస్ చైర్మన్లుగా 15 మంది మహిళలు ఉన్నారు.
మొత్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, డిప్యూటీ మేయర్లు 36 పదవులు ఉంటే… ఇందులో 18 పదవుల్లో మహిళలు ఉన్నారు.
2.60 లక్షల మందికి వలంటీర్ ఉద్యోగాలు ఇస్తే.. వీరిలో కూడా 53 శాతం మహిళలకే కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతోంది.