
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల ఎదుటు దోళనలు చేపట్టింది. రేషన్ బియ్యం పంపిణీలోనూ అవకతవకలు జరుగుతున్నాయని నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వోలకు వినతి పత్రాలు అందజేచేశారు.
అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం కూడా పక్కదారి పడుతున్న రెషన్ బియ్యంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిని గుర్తించి.. కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు.
కొందరు దండగులు పేదలకు దక్కాల్సిన టన్నులకొద్ది రేషనే బియ్యాన్ని విదేశాలకు విక్రయిస్తున్నారన్నారు. ఈ మాఫియాను అరికట్టాల్సిన అవవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు రేషన్ షాపుల్లో సోదాలు నిర్వహించాలన్నారు.