
అమరావతి: జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు త్వరలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే, ఆయనకు ఏ మాత్రం మంత్రి పదవి ఇవ్వకూడదని టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యవహారం టీడీపీ వర్గాల్లో పెన్చర్చకు దారితీసింది.
టీడీపీ నేతకు ఎమ్మెల్సీ అవకాశం ఎందుకు దక్కలేదు?
టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం, పిఠాపురం టీడీపీ ఇన్చార్జ్ వర్మకు ఎమ్మెల్సీ పదవి దక్కకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు అడ్డుకున్నారనే ప్రచారం బలంగా కొనసాగుతోంది. ఇది టీడీపీ శ్రేణుల తీవ్ర అసంతృప్తికి కారణమైంది.
నాగబాబు వ్యాఖ్యలు వివాదాస్పదం
ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసిన అంశం – జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు వెనుక టీడీపీ పాత్రను పూర్తిగా తిరస్కరించినట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
“పవన్ విజయం వెనుక జనసేన తప్ప ఇంకెవరూ లేరు. ఎవరికైనా క్రెడిట్ తీసుకెళ్లాలని ఉంటే, అది వారి వ్యక్తిగత భ్రమ!”
అంటూ నాగబాబు వ్యాఖ్యానించడం టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమైంది.
“నాగబాబుకు మంత్రి పదవి అంటే.. కూటమికి ప్రమాదం”
టీడీపీ కార్యకర్తలు, నేతలు స్పష్టంగా చెబుతున్నారు –
“నాగబాబు చిరునవ్వుతోనే టీడీపీపై సెటైర్లు వేస్తున్నారు. అలాంటివారికి మంత్రి పదవి అంటే కూటమికి ప్రమాదమే!”
టీడీపీ కార్యకర్తలు సీఎం చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ,
“నాగబాబుకు మంత్రి పదవి అంటే పాముకి పాలుపోసినట్టే. చంద్రబాబు గారు జాగ్రత్త!”
అని సూచిస్తున్నారు.
ఇప్పుడు నాగబాబు భవిష్యత్‌పై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Also read:
https://deccan24x7.in/telugu/pawan-kalyan-says-jsp-strengthened-tdp/