
tdp protest
రాష్ట్రంలో ధరల పెరుగుదలపై టీడీపీ శాసనసభ పక్షం ఆందోళన బాట పట్టింది. ధరల పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నారా లోకేష్ ఆధ్వర్యంలో తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి అసెంబ్లీకి కాలినడకన ప్రదర్శన చేపట్టారు. ‘బాదుడే బాదుడు’ పేరుతో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ‘ధరలు దిగిరావాలి అంటే జగన్ దిగిపోవాలి’ అని నేతలు నినాదాలు చేశారు. నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
‘ధరలు ఆకాశంలో… జగన్ ప్యాలస్’, ‘చెత్త పై పన్నేసిన చెత్త సిఎం జగన్’ అని ఉన్న ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి.. సీఎం జగన్ సామాన్యులను దోపిడీ చేస్తున్నారన్నారు. షాక్ కొట్టేలా విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారన్నారు. జగన్ పాలనలో ఇసుక బంగారమైందన్నారు.
ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ఓటీఎస్ తో పేదల్ని దోచేశారని ఆరోపించారు. ఇంటి పన్ను పెంచి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యులను జగన్ ప్రభుత్వం నిండా దోచేస్తుందన్నారు.