
ayyanna patrudu arrest
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో అరెస్టు అయ్యారు. సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. అలాగే అయ్యన్న కుమారుడు రాజేశ్ ను కూడా సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అభియోగంపై అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయ్యన్నపాత్రుడిపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సీఐడీ పోలీసులు. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామని సీఐడీ పోలీసులు తెలిపారు.
అయ్యన్నను అరెస్టు చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త, కుమారుడికి ప్రాణహాని ఉందన్న అయ్యన్న భార్య పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా జరిగితే.. ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం పద్మావతి చేశారు.
అర్ధరాత్రి గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. దారుణంగా వ్యవహరించారని పద్మావతి తెలిపారు. కనీసం దుస్తులు మార్చుకొనివ్వకుండా నా భర్తను తోసుకుంటూ తీసుకువెళ్లారని విలపించారు.