
TDP Fake propaganda
అధికార వైఎస్సార్సీపీ- ప్రతిపక్ష టీడీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరందుకున్నాయి. ఇరు పార్టీలు విమర్శించుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. సమయం వచ్చినప్పుడల్లా ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. తాజాగా గంజాయి ఫొటోలు, తిరుమలలో గోడలకు రంగులు మార్పును సాకుగా చూపుతూ వైసీపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది టీడీపీ. ఈ అంశాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను వైసీపీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
టీడీపీ ఆరోపణలు..
శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. గోవింద నామ స్మరణతో మాఢ వీధులు మారుమోగుతున్న వేళ.. ఉత్సవాలకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలు జరిగాయి. అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ.. విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తిరుమలలో అలిపిరికి వెళ్లే మార్గంలో గోడలపై వైసీపీ రంగులు, రోడ్లపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై టీడీపీ ఆరోపణలను గుప్పిస్తోంది. గోడలపై ఉన్న దేవుడి చిత్రాలపై వైసీపీ రంగులు వేశారని సోషల్ మీడియా వేదికగా.. విమర్శిస్తోంది.
దీనికి తోడు వైసీపీ మరో విమర్శనాస్త్రాన్ని సంధిస్తోంది టీడీపీ. ఆంధ్రప్రదేశ్లో దొరికినంత గంజాయి మరే రాష్ట్రంలోనూ స్వాధీనం చేసుకోలేదని.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) నివేదిక-2021 పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఎన్సీబీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయి దొరికింది. ఇందులో 2,00,588కిలోలను (26.75%) ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే గుర్తించినట్లు ఎన్సీబీ చెబుతోంది. అయితే ఇది వైసీపీ పాలన వైఫల్యంగా టీడీపీ ప్రచారం చేస్తోంది.
తిప్పికొట్టిన వైసీపీ..
టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటూ వైసీపీ తిప్పికొడుతోంది. టీడీపీ చేస్తున్నవి అసత్య ప్రచారాలని కౌంటర్ ఎటాక్ చేస్తోంది. తిరుమలలో దేవుడి పై రాజకీయం చేయడం ఏంటని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ కు రోజురోజు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక దుష్టచతుష్టయం ఇలాంటి అసత్య ప్రచారాలను చేయిస్తోందని మండిపడుతున్నారు. తిరుమలలో సీఎం జగన్ పర్యటన ముగిసిన వెంటనే.. టీడీపీ కావాలనే ఇలా ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే సోషల్ మీడియాలో టీడీపీ అసత్య ప్రచారాన్ని చేస్తోందని వైసీపీ విరుచుకుపడింది.
ఫ్యాక్ట్ చెక్ తో బయటకొచ్చిన నిజం
తిరుమలలో గోడ చిత్రాలపై జరుగుతున్న ప్రచారం దురుద్దేశపూరితంగా చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. నగర వ్యాప్తంగా వెలిసిపోయిన గోడ చిత్రాల స్థానంలో కొత్త కళాకృతులను తీర్చి దిద్దేందుకు పనులు జరుగుతున్నాయని చెప్పింది. జాతీయ నేతల చిత్రాలను గోడలపై పొందుపరుస్తున్నట్లు ఏపీ ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది.
సోషల్ మీడియాలో ఐటీడీపీ షేర్ చేసిన గంజాయి ఫొటోలపై కూడా.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. అమెరికా నుంచి దిగుమతి చేస్తూ పట్టుబడిన గంజాయి ఫొటోలుగా తేల్చింది. అయితే ఆ ఫొటోలు ఆంధ్రప్రదేశ్ ఫొటోలుగా అసత్య ప్రచారం చేస్తున్నట్లు ఆధారాలతో తెలిపింది.
మొత్తంగా టీడీపీ చేసిన ప్రచారమంతా పస లేనిదని తేలిపోయింది.