
ramoji rao
మార్గదర్శి ఫైనాన్షియర్స్తో పాటు ఆ సంస్థ అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రిజర్వు బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించారన్న కేసులో రామోజీరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆర్ బీఐ నిబంధనల ఉల్లంఘన కేసులో రామోజీరావుపై ఉన్న అభియోగాలు కొట్టివేస్తూ.. 2018లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వంతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను కలిపి విచారించింది ధర్మాసనం.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. రామోజీరావు నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని.. ఈ క్రమం హైకోర్టు కొట్టివేయడం సరికాదన్నారు. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశారా? అని సుప్రీం కోర్టు ప్ర శ్నించగా.. పరిశీలించి చెప్తామని వికాస్ సింగ్ బదులిచ్చారు. కాగా, ఉండవ ల్లి తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, న్యాయవాది అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు.
ఇదిలా ఉంటే.. రామోజీరావు సైతం ఓ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రామోజీరావు పిటిషన్ కు సంబంధించి.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్ల విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.