
chandrababu naidu
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ‘బాదుడే బాదుడు’ నిరసన రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబుపైకి ఓ దుండగుడు రాయి విసరడం కలకలం రేపింది. ఈ ఘటనలో చంద్రబాబు ప్రధాన భద్రతా అధికారి మధుకి గాయాలయ్యాయి. తన పర్యటనలో పోలీసులు భద్రత సరిగ్గా లేకపోవడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గూండాలు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. గాయపడ్డ సీఎస్వో మధుబాబుకు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. గడ్డం కింది భాగంలో మధుబాబు గాయమయ్యింది.
జగ్గయ్యపేటలో జరిగిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం కరెంట్ బిల్లల నుంచి ఇంటి పన్నుల వరకు అన్నీ పెంచినట్లు ధ్వజమెత్తారు. చెత్తపైనా పన్ను వేస్తున్న చెత్త ప్రభుత్వం ఇది అంటూ దుయ్యబట్టారు.
ఇసుక దోపిడితో ఓ ఎమ్మెల్యే అక్రమార్జన చేస్తున్నారన్నారు చంద్రబాబు. ఆడబిడ్డల మంగళసూత్రాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన జగన్ కు సీఎంగా ఉండే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. కాలేజ్ ఫీజులు నేరుగా కాలేజ్ లకు కట్టకపోవడం వెనుక కూడా జగన్ అక్రమార్జన వ్యూహం ఉందన్నారు. జగన్ కు 175సీట్లు రావడం కాదు….ఎన్నికల అనంతరం జగన్ జైలకు వెళ్లడం ఖాయమన్నారు జగన్.
పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని సీఎం మూడు రాజధానులు కడతారా? అని ప్రశ్నించారు చంద్రాబాబు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. నాడు నేను కట్టిన హైటెక్ సిటీ తరువాత వచ్చిన వైఎస్ఆర్ కూలగొట్టి ఉంటే ఈ రోజు ఇంత నగరం అయ్యేదా అన్నారు. అమరావతిని కూడా ఆ స్థాయి నగరం చేయాలని తాను అనుకున్నట్లు చెప్పారు చంద్రబాబు.