
దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవడంలో హీరోయిన్లు ముందుంటారు. ఆ జాబితాలోకి తాజాగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వచ్చి చేరింది. భారీ ప్రాజెక్టులు చేతిలో ఉండడంతో శ్రుతి అమాంతం రెమ్యునరేషన్‌ను పెంచేసిందట. అది కూడా కోట్లలో పెంచేసినట్లు సమాచారం. గతంలో ఒక సినిమాకు కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకున్న ఈ భామ.. ప్రస్తుతం2.5-3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. సక్సెస్ రేట్ బాగా ఉండడంతో దర్శక నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మ డిమాండ్లను ఓకే చెబుతున్నారట. దీంతో శృతి హాసన్ రెమ్యునరేషన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిగ్ గా మారింది.
వ్యక్తిగత కారణాలతో సినిమా ఇండస్ట్రీకి మూడేళ్ల పాటు దూరమైంది శృతి. రవితేజ క్రాక్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో కలిసి వకీల్‌సాబ్ సినిమాతో బ్లాక్బస్టర్హిట్ కొట్టింది. ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తోంది. గోపిచంద్ మలినేని- బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీలోనూ ఈ భామే హీరోయిన్. చిరంజీవి మెగా154లోనూ శ్రుతినే కథానాయిక. ఇలా క్రేజీ ప్రాజెక్టులతో ఈ ముద్దు గుమ్మ బిజిబిజీగా గడుపుతోంది.