
tdp chief chandrababu naidu
- ముఖ్యనేతల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ముందస్తు ఎన్నికలకు టీడీపీ నాయకులు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు సూచించారు. వైసిపి పెద్దలే విశాఖను మింగేశారని, సేవ్ ఉత్తరాంధ్ర తమ స్లోగన్ అన్నారు. తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లు, ముఖ్యనేతలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ వంటి అంశాలపై నివేదికల ఆధారంగా రివ్యూ చేశారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఆలోచనతోనే నేతలు పని చేయాలన్నారు చంద్రబాబు నాయుడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలని సూచించారు. తాము గెలుస్తాము అనే నమ్మకాన్ని నేతలే తనకు కల్పించాలన్నారు. పనితీరు ద్వారా తాము గెలిచే అభ్యర్థులమని ప్రూవ్ చేసుకోవాలని.. లేకపోతే భిన్నమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.
పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ లో వెనుకబడి ఉన్న నేతలను స్పీడు పెంచాలనన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనతో నష్టపోని వర్గం అంటూ లేదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు జగన్ పాలనతో విసిగిపోయారని చంద్రబాబు అన్నారు. ఈ ప్రజా వ్యతిరేకతను పార్టీ అనుకూలంగా మార్చుకోవాలన్నారు.
మూడు రాజధానులు అంటూ జగన్ మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. విశాఖను మింగేసి.. ఉత్తరాంధ్రను కబళిలిస్తున్న వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు టీడీపీ పోరాడాలన్నారు. మూడు రాజధానులు సాధ్యం కాదని కోర్టులు స్పష్టంగా చెపుతున్నా… ఉత్తరాంధ్ర, రాయలసీమలలో రాజధానులు అంటూ జగన్ జనాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. సాగునీటి రంగంలో ఎవరి హయాంలో ఎక్కువ మేలు జరిగిందో ఈఎన్సీ నారాయణ రెడ్డి మీడియా సమావేశం ద్వారానే స్పష్టంగా తెలిసిపోయిందన్నారు.
బాలకృష్ణ షోలో పాల్గొన్నాను..
సినీ నటులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షో పైనా సమావేశంలో చర్చకు వచ్చింది. బోల్డ్ గా ఉండే బాలకృష్ణ శైలి కారణంగా ఆ షో అంత హిట్ అయ్యిందని చంద్రబాబు అన్నారు. తాను ఆ షో ఇంటర్వ్యూకి హాజరు అయ్యానని చంద్రబాబు తెలిపారు. నాడు అధికార మార్పిడి విషయంలో వాస్తవంగా జరిగింది ఏంటి అనేది ఆ షోలో చర్చకు వచ్చిందని చంద్రబాబు అన్నారు. దశాబ్దాలుగా తనపై బురదవేస్తున్న అంశంలో తాను ఓపెన్ గా పలు విషయాలు చెప్పానని చంద్రబాబు తెలిపారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత తీవ్రంగా నష్టపోయారని.. వారంతా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులకు ఓటు వేసేలా చూడాలని నేతలకు సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ను గెలిపించేందుకు ఇంచార్జ్ లు గట్టిగా పనిచెయ్యాలని చంద్రబాబు సూచించారు.