
samantha
ఉత్తరాది, దక్షిణాది అంటూ.. తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్ సమంత. సోషల్ మీడియాలో సమంత ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన అప్డేట్లను ఎప్పటికప్పుడు ఇస్తూ.. అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో సమంత పెట్టిన పోస్ట్ అమె అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడిని షాక్ కు గురి చేసింది.
వాస్తవానికి గత కొంత కాలంగా.. సోషల్ మీడియాలో సమంత సైలెంట్‌గా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో సామ్ చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడమే దీనికి కారణమంటూ నెట్టింట వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై సమంత ఎప్పుడూ స్పందించలేదు.
అయితే తాజాగా ఆ వార్తలకు చెక్ పెడుతూ.. అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. తాను మ్యూసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించింది. చేతికి సెలైన్‌తో డబ్బింగ్ చెబుతున్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఓ ఫొటోను షేర్ చేసింది సమంత. ఈ సందర్భంగా తను చెప్పాలనుకున్న విషయాన్ని ఆ ఫొటోకు జత చేసింది.
‘నేను మ్యూసిటిస్ (కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, నడవ లేకపోవడం, నీరసంగా ఉండటం) అనే వ్యాధితో బాధపడుతున్నాను. గత కొన్ని నెలల క్రితమే ఈ వ్యాధి సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా మీకు చెబుతున్నా. త్వరలోనే ఈ సమస్య నుంచి బయటపడతాను’ అని రాసుకొచ్చింది.