
స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరస అవకాశాలతో దూసుకుపోతున్న సమంత.. తాజాగా ముంబయిలో ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం.. పాన్ ఇండియా స్థాయి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సమంత వరుస సినిమా షూటింగులతో బిజీగా గడుపుతుంది.
ఈ ముద్దుగుమ్మ ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నారు. అలాగే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా ఈమె మరింత క్రేజ్ సంపాదించుకున్నారని చెప్పాలి. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సమంతకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సమంత ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాదులో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేస్తున్న ఈమె ముంబైలో కూడా బీచ్ వ్యూ ఉండేలా ఓ అందమైన ఇంటిని కొనుగోలు చేశారని ఈ ఇంటి కోసం సమంత దాదాపు 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది.