
cm jagan
స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేలా రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి చేయూతను అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సామాన్యులకు అండగా నిలవడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తోంది.
స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న 8పథకాల గురించి, మహిళల సాధికారతే లక్ష్యంగా చేపట్టిన మూడు పథకాల గురించి ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. రూ.19వేల 129 కోట్లు వెచ్చించి 55.57లక్షల మందికి లబ్ధి చేకూర్చనున్నారు. మత్స్యకారులకు, నేతన్నలకు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పాటు పడేవారికి సహకారం అందిస్తున్నారు.
వైఎస్సార్ వాహన మిత్ర – ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సాయం
జగనన్న చేదోడు – రజక, దర్జీ, నాయీ బ్రాహ్మణులకు సాయం
వైఎస్సార్ నేతన్న నేస్తం – చేనేత కార్మికుల కోసం
మత్స్య కార భరోసా – మత్స్యకారులకు అండగా నిలిచేందుకు..
ఎమ్ఎస్ఎమ్ఈ పున:ప్రారంభం – 12లక్షల మందికి ఉద్యోగాలు
జగనన్న తోడు – వీధి వ్యాపారులకు, సంప్రదాయ పనులు చేసేవారికి సాయం
వైఎస్సార్ చేయూత
వైఎస్సార్ కాపు నేస్తం
వైఎస్సార్ ఈబీసీ నేస్తం
ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పెట్టుబడులు:
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వెల్లువ మొదలైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రకారం.. 2022 ఏడాది తొలి 7నెలల్లోనే 40వేల 361కోట్లు రాబట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయాన్ని డీపీఐఐటీ తన నివేదికలో స్పష్టం చేసింది.