
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విష్యం తేయాలిసిందే . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, వారి భార్య బ్రాహ్మణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది.
తెలుగుదేశం పార్టీ మండల పరిషత్ కార్యదర్శి రామలింగం ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. వర్మ గతేడాది అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు ఈ కేసుకు కారణమని సమాచారం. ఐటీ చట్టం కింద ఈ కేసు నమోదు చేయగా, వ్యూహం సినిమాకు ప్రమోషన్లో భాగంగా వర్మ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఒంగోలు పోలీసులు వర్మ నివాసానికి చేరుకొని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే వర్మ ఈరోజు విచారణకు హాజరుకాలేనని తెలిపారు.
విచారణకు సహకరించకపోతే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోలీసులు వర్మను ఒంగోలుకు తీసుకెళ్లి విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెలుగు చూస్తాయని తెలుస్తోంది.