
పోలీసులను నమ్మండి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గోషామహల్‌లోని పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద పోలీస్ డే జెండా కవాతు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ సందర్భాంగంగా మాట్లాడుతూ , తెలంగాణలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే వ్యక్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా మతపరమైన ప్రదేశాల దగ్గర ఎలాంటి ఆటంకాలు ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం సహించబోదని, ప్రజాల శాంతికి ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
సికింద్రాబాద్‌లో ఇటీవల ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ, విగ్రహ విధ్వంసం కేసుకు సంబంధించిన హోటల్‌ను ధ్వంసం చేయడానికి గుంపు ప్రయత్నించింది, సీఎం ప్రజల తీరును వేతిరేకిస్తు పౌరులను హెచ్చరించారు. “అటువంటి పరిస్థితులను నియంతరించడానికి పోలీసులను నమ్మండి “చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు” అని అన్నారు.
అలాగే మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాఠశాల పోలీసు సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబాల పిల్లలకు రెసిడెన్షియల్ విద్యను అందిస్తుంది. ప్రత్యేకించి గణేష్ చతుర్థి, ముహర్రం వంటి ప్రధాన పండుగల సందర్భంగా వనరులతో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పోలీసు యంత్రాంగం అంకితభావంతో పని చేయాలి అని ముఖ్యమంత్రి ప్రశంసించారు.