
pawan kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రాణహాని ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా కొందరు అనుమానాస్పద వ్యక్తులు పవన్ ఇంటి వద్ద, జనసేన పార్టీ కార్యాలయం వద్ద అనుమానాస్పందంగా తిరుగుతున్నారని చెబుతున్నారు. పవన్ హత్యకు రెక్కీ నిర్వహించినట్లు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయాలు చెప్పింది.. మామూలు వ్యక్తి కాదు. జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదేండ్ల మనోహర్ ఈ ఆరోపణలు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ.. మనోహర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. విశాఖ గర్జన నేపథ్యంలో జరిగిన ఘర్షణ తర్వాత.. పవన్ కల్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర కొందరు వ్యక్తులు వ్యక్తులు తచ్చాడుతున్నారని ప్రెస్ నోట్ లో మనోహర్ పేర్కన్నారు. పవన్ ఎటు వెళ్లినా.. ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని ఆరోపించారు. కొందరు వ్యక్తులు పవన్ కల్యాణ్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడినట్లు వివరించారు. ఈ సంఘటనపై జనసేన తెలంగాణ ఇన్చార్జి శంకర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే పవన్ కల్యాణ్ పై రెక్కీ అంశం.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పవన్ ను చంపేస్తారా ? అంటూ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ రెక్కీ వెనకాల అధికార పార్టీ హస్తం ఉందని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. పవన్ కు ఏం జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
రూ. 250 కోట్ల సుపారీ..
పవన్ కల్యాణ్ ను హత్య చేసేందుకు భారీ స్థాయిలో కుట్ర జరిగినట్లు జనసేన అనుమానిస్తోంది. ఇది ఒకరోజు, రెండు రోజుల్లో చేసింది కాదని ఆరోపిస్తోంది. పవన్ హత్యకు దాదాపు రూ. 250కోట్ల సుపారీ ఇచ్చినట్లు జనసేన నాయకులు అనుమానిస్తున్నారు.