
ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10-20% పెంపు ఉండనుంది. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నిర్మాణ విలువలపైనా 6% వరకు పెంపు ఉంటుంది. పెంకుటిళ్లు, రేకుల షెడ్లు, ఇతర వాటికి చదరపు అడుగుకు 740, 580, 420 వసూలు చేస్తారు. ప్లాట్లకు(గ్రౌండ్ ,1st, 2nd ఫ్లోర్) రూ.1,490, రూ. 1,270, రూ.900 వసూలుకు నిర్ణయించారు.