
chandrababu-pawan
విశాఖలో జరిగిన ఘటనలో జనసేన కార్యకర్తలు చేసింది తప్పని.. వైజాగ్ ప్రజలు చెబుతున్నారు. కానీ రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం.. జనసేన నాయకులు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు తెగ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చేరారు. పవన్ కల్యాణ్ పై విశాఖలో ప్రభుత్వం ప్రవర్తించిన తీరు దుర్మార్గం అని బాధపడ్డారు చంద్రబాబు. విలేకరుల ముందు పవన్ కల్యాణ్ పై తన ప్రేమను బహిరంగంగా వెలుబుచ్చారు.
విజయవాడలో పవన్ బస చేస్తున్న హోటల్ కు వచ్చి స్వయంగా సంఘీభావం తెలిపారు చంద్రబాబు. ఈ పరిణామం.. భవిష్యత్ లో చంద్రబాబు-పవన్ పొత్తు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ ను కలిశాక చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖలో పవన్ కార్యక్రమాన్ని ఇష్యూ చేశారని తెగ బాధపడ్డారు చంద్రబాబు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పవన్ విశాఖ వెళ్లారని, పవన్ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించిన ఊగిపోయారు. పవన్ విశాఖ నుంచి వెళ్లిపోయే వరకు పవన్ ఎంత వేధించాలో అంత వేధించారంటూ చంద్రబాబు మీడియా ముఖంగా ఫైర్ అయ్యారు.
అయితే పవన్ విషయంలో చంద్రబాబు ఎందుకు అంత ఆవేదన చెందుతున్నరని వైజాగ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విశాఖలో మంత్రులపై దాడులు చేసింది.. జన సేన సైనికులు అయితే.. ఇక్కడ ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఏం తప్పు చేశారని ప్రశ్నిస్తున్నారు. విశాఖను రాజధాని కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కు విశాఖలో పర్యటించే అర్హత లేదని చెబుతున్నారు.
ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందంటూ.. చంద్రబాబు ఎనలేని ఆవేదనను వెలుబుచ్చారు. అయితే వైజాగ్.. హింసకు పాల్పడింది జనసేన సైనికులు కాదా? వైజాగ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా ర్యాలీని నిర్వహించి.. ఘర్షణకు తెరలేపింది పవన్ కల్యాణ్ కాదా? ఉత్తరాంధ్ర ప్రజలు అడుగుతున్నారు.
రాజకీయ నాయకులకే రక్షణ లేకుంటే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది చంద్రబాబు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడూ అబద్ధాలు చెప్పే చంద్రబాబు.. ఇదొక్కటి మాత్ర నిజం చెప్పినట్లు అనిపిస్తోంది. విశాఖలో ఏకంగా మంత్రులపై రాళ్లు వేశారు జనసేన నాయకులు. జనసేన కార్యకర్తల వల్ల ఏకంగా మంత్రులు ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయింది.