
padayatra
అమరావతి రైతుల పేరుతో పాదయాత్ర కొనసాగుతోంది. అమరావతి నుంచి అరసవల్లి వరకు ఇది జరగనుంది. అయితే ఈ పాదయాత్ర తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడమే పాదయాత్ర చేస్తున్న వారి ప్రధాన లక్ష్యమా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది.
అమరావతిని మాత్రమే అభివృద్ధి చేసి.. మిగతా ప్రాంతాలను గాలికొదిలేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
అధికార వికేంద్రీకరణ జరిగితే.. ప్రభుత్వ ఫలాలు అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు అందుతాయి. ఎలాంటి జాప్యం లేకుండా.. సకాలకు సేవలు అందుతాయి. అభివృద్ధి కూడా అన్ని ప్రాంతాల్లో సమపాళ్లలో జరుగుతుందనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అయితే అమరావతి భూ స్కామ్ లో భాగమైన పలువులు టీడీపీతో కలిసి.. వికేంద్రీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్ ను గుణపాఠంగా తీసుకొని.. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. అభివృద్ధిని ఒకే దగ్గర కేంద్రీకృతం చేయకుండా వైసీపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అయితే టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు జగన్ దూర దృష్టికి విఘాతం కలిగిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే.. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే చెప్పాలి.
దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి రాయలసీమ దగా పడింది. అక్కడ అభివృద్ధి అంతంత మాత్రమే. కర్నూలును న్యాయ రాజధాని చేస్తే.. ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ భవనాల నిర్మాణంతో భూమ్ పెరిగే అవకాశం ఉంది. తద్వారా అభివృద్ధి చెందుతుంది.
ఉత్తరాంధ్రలో విశాఖ నగరం తప్పించి.. మిగతా ప్రాంతం అంతా వెనకపడ్డదే. అక్కడ అడ్మినిష్ట్రేటివ్ పెడితే.. ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. మరో రాజధానిగా అమరావతి ఎలాగూ ఉంటుంది. చట్టసభలు అమరావతిలోనే ఉంటాయి.
సీఎం జగన్ తాడేపల్లిలో ఉంటానని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం ఇంత క్లియర్ కట్ గా చెప్పినా… టీడీపీ మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో వెనక్కు తగ్గడం లేదు.
భూస్వాములతో కృత్రిమంగా సృష్టించిన పాదయాత్ర ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. తద్వారా ఆ రెండు ప్రాంతాలకు చెందిన భవిష్యత్ తరాలను దగా చేస్తోంది.