
TDP
- ఏ వ్యక్తి శాశ్వతం కాదు.. చేసే పనులు శాశ్వతం..
- ‘వివాదాలు – వాస్తవాలు’ పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు నాయుడు
చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ల వల్ల ఆయా రాష్ట్రాలకు ఆదాయం పెరిగిందని, అందుకే అమరావతి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయన్నారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి శాస్వతం కాదని, మనం చేసే పనులు శాశ్వతం అన్నారు. పాలకుల వల్ల రాజకీయ లబ్ది జరిగిందా? లేక ప్రజలకు మంచి జరిగిందా ? అనేది చూడాలన్నారు. అమరావతిపై కందుల రమేష్ రాసిన ‘వివాదాలు – వాస్తవాలు’ పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
నాటి తమ సంకల్పం వృథా కాదు అని, అమరావతి గెలుస్తుందన్నారు చంద్రబాబు. రాజధాని కట్టిన తరువాత అమరావతిలో 8000నుంచి 10000 ఎకరాలు ప్రభుత్వానికి మిగులుతుందన్నారు. ఇప్పుడు అమరావతి ఉండి ఉంటే.. హైదరాబాద్ కోకాపేట భూముల ధరల లాగా రేట్లు పెరిగి.. ఇక్క కూడా రెండు లక్షల కోట్ల విలువైన ఆస్థి అందుబాటులోకి వచ్చేదన్నారు చంద్రబాబు.
ఆనాడు రైతులు ముందుకు వస్తే…. వారి భాగస్వామ్యంతో రాజధాని కట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు చంద్రబాబు. మంచి ప్యాకేజ్ ఇస్తే భూములు ఇవ్వడానికి సిద్దమే అని నాడు రైతులు అంగీకరించినట్లు వివరించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు చివరి ప్రాంతాలకు మధ్యలో ఉన్న ప్రాంతం అమరావతి అని, అక్కడే రాజధాని కట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. తాను రాయలసీమ వాడినని, కావాలనుకుంటే తాను ఆనాడు తిరుపతిలో రాజధాని పెట్టుకునేవాడినన్నారు.
రాజధాని కోసం నాడు సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇవ్వడానికి అంగీకరించినట్లు చెప్పారు చంద్రబాబు. ఈ రోజు అమరావతిని చూస్తే చాలా బాధ కలుగుతుందన్నారు. 1000 రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నారు. రైతుల ఉక్కుసంకల్పానికి అభినందనలు తెలిపారు. వెయ్యి రోజుల ఆందోళన ఎక్కడా జగరలేదన్నారు. ఇది అమరావతి రైతుల ఘనత అన్నారు. అమరావతిపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని నాడు వైసీపీ నేతలు చెప్పినట్లు చెప్పారు.
” శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నా హయాంలో భూములు సేకరించా.. తరువాత వచ్చిన వైఎస్ ఆర్ భూమిపూజ చేసి ప్రాజెక్టు పూర్తి చేశారు. నా తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు అంతా నాడు హైదరాబాద్ లో ప్రాజెక్టులు కొనసాగించారు. అందుకే నేడు హైదరాబాద్ ఆ స్థాయికి చేరింది.
ఆదాయం ఇచ్చే హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళితే.. మనకు ఆదాయం ఎలా అని ఇక్కడి ప్రజలు ఆలోచించారు. అందుకే నాకు ఉన్న అనుభవాన్ని గుర్తించి 2014లో ప్రజలు నాకు అధికారం ఇచ్చారు. విభజనతో వచ్చిన కేంద్ర సంస్థలను రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పెట్టాము. అభివృద్దిని వికేంద్రీకరించాము.” – చంద్రబాబు
నాటి తమ సంకల్పం వృథా కాదు అని, అమరావతి గెలుస్తుందన్నారు చంద్రబాబు. రాజధాని కట్టిన తరువాత అమరావతిలో 8000నుంచి 10000 ఎకరాలు ప్రభుత్వానికి మిగులుతుందన్నారు. ఇప్పుడు అమరావతి ఉండి ఉంటే.. హైదరాబాద్ కోకాపేట భూముల ధరల లాగా రేట్లు పెరిగి.. ఇక్క కూడా రెండు లక్షల కోట్ల విలువైన ఆస్థి అందుబాటులోకి వచ్చేదన్నారు చంద్రబాబు.