
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని బత్తలపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత సూర్యనారాయణపై బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలు స్థానికంగా సంచలనం సృష్టించాయి.
బహిర్భూమికి వెళ్లిన బాలికపై సూర్యనారాయణ అత్యాచారానికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ విషయం బయట చెప్పితే ప్రాణాలు తీస్తానని నిందితుడు బెదిరించినట్లు బాలిక తల్లిదండ్రులు పేర్కొన్నారు .ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సూర్యనారాయణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.
ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం బాధిత కుటుంబానికి మద్దతుగా స్థానికులు ముందుకు వస్తున్నారు.బాధిత కుటుంబం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారిన ఈ టీడీపీ నేతపై తాజా ఆరోపణలు పార్టీకి తలనొప్పిగా మారాయి.
ఈ కేసు గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి…