
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఓ యువకుడు చేసిన పని చివరకు పోలీసు కేసులకు దారితీసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్),హైదరాబాద్‌పై డబ్బుల కట్టలు విసురుతూ ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను రూపొందించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.
పోలీసుల దర్యాప్తులో ఆ యువకుడిని గుర్తించి అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ చర్య కేవలం సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందడానికే చేపట్టినదని నిర్ధారించారు. రాచకొండ పోలీసులు ఇలాంటి చర్యలు సమాజంపై చెడు ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు సాధించేందుకు నిబంధనలు అతిక్రమించడం లేదా ప్రమాదకరంగా ప్రవర్తించడం కఠిన చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ప్రోత్సహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.