
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందుగా హామీ ఇచ్చిన “సూపర్ సిక్స్” గ్యారంటీలను ప్రస్తుతం అమలు చేయలేమని ప్రకటించడంతో రాజకీయ చర్చ మొదలైంది.
నితి ఆయోగ్ నివేదిక ప్రకారం, 2019-2024 కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీసిందని నాయుడు ఆరోపించారు. తగిన నిధులు లేనందున ఉచిత ఆర్టీసీ ప్రయాణం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆదాబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలను తక్షణం అమలు చేయడం కష్టమని అన్నారు.
ఈ ప్రకటనపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఇది చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయిన సూచన అని పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
తెలకపల్లి రవి అనే రాజకీయ విశ్లేషకుడు, ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసి, ఇప్పుడు చేతులెత్తేశారని , ప్రజల ఆగ్రహం తట్టుకోలేక, చంద్రబాబు జూన్ నెల నుంచి అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ముందుగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో వెల్లడించింది.