
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించే నిర్ణయాన్ని మంత్రి మండలి ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక మద్యం వినియోగంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ సవరణపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. దేశీయ తయారీ విదేశీ మద్యం, బీర్, ఎఫ్ఎల్ స్పిరిట్లపై టాక్స్ రివిజన్ ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
అలాగే, విశాఖపట్నం గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో 1,000 గజాల వరకు అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణ కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గతంలో నిర్మించిన ఇళ్లకు చట్టసవరణ ద్వారా లబ్ధి కల్పించనున్నారు.
ఇక పట్టాదారు పుస్తకాలకు సంబంధించి చట్ట సవరణ ప్రతిపాదనకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ & కెపాసిటీ బిల్డింగ్ 2025 కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.