
venkaiah naidu
దేశంలో, రాష్ట్రంలో శక్తివంతమైన ప్రతిపక్షాలు అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. స్థిరమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా సమర్ధవంతమైన ప్రభుత్వాలు కూడా ఉండాలని పిలుపునిచ్చారు. బుధవారం విశాఖలో ఏర్పాటు చేసిన ‘ఆత్మీయ సమావేశం’లో ఆయన మాట్లాడారు. తన ఎదుగుదలలో మిత్రులు పాత్ర కూడా ఉందన్నారు వెంకయ్య. వారి ఆదరణ ఎప్పటికీ మరువలేనన్నారు. అందుకే అన్ని ప్రాంతాలకు వెళ్లి.. తన మిత్రులను పలకరించాలని నిర్ణయించుకున్నట్లు తెప్పారు వెంకయ్య. అయితే తనకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మాత్రం లేదన్నారు.
ప్రశ్నించడానికి అవసరమైన నైతిక శక్తి ఉన్న ప్రతిపక్షం కావాలని పిలుపునిచ్చారు. అయితే అది ప్రత్యామ్నాయం చూపించేదిగా ఉండాలన్నారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే ప్రతిపక్షాల అవసరం అన్ని రాష్ట్రాల్లోనూ ఉందన్నారు.
మాతృభాషలో మాట్లాడానికి ప్రతి ఒక్కరు గర్వించాలన్నారు వెంకయ్య. రాజ్యసభ సభ్యులు మాతృభాషలో మాట్లాడగలిగేలా అవకాశం కల్పించడానికి తాను కృషి చేసినట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన ఇంగ్లీషులో జరుగుతుందని చెప్పారు. బోధనా భాషగా, పరిపాలన భాషగా తెలుగు ఉండాలన్నారు.