
nayanthara twins
కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార- విఘ్నేశ్ శుభవార్త చెప్పారు. తాము కవలలకు తల్లిదండ్రులమైనట్లు నయన్ భర్త విఘ్నేశ్ ప్రకటించారు. ఇది విన్న నయన్ ఫ్యాన్స్ ఒకింత సంతోషంతో పాటు షాక్ కు గురయ్యారు. బేబీ బంప్ లేకుండానే.. పైగా పెళ్లైన నాలుగు నెలలకే కవలలకు నయనతార ఎలా జన్మనిచ్చింది అనే సందిగ్ధంలో మునిగిపోయారు.
సరోగసి విధానం ద్వారా నయనతార- విఘ్నేశ్ దంపతులు కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్.. దాదాపు ఐదేళ్ల ప్రేమ బంధం తర్వాత.. పెళ్లి చేసుకున్నారు. అయితే సరోగసి ద్వారా పిల్లలను కనాలని ముందే ప్లాన్ చేసుకొని.. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అందుకే పెళ్లైన నాలుగు నెలలకే ఇద్దరు తల్లిదండ్రులు అయ్యారు.
ఇదిలా ఉంటే.. కవలలకు తల్లిదండ్రులైన నయనతార- విఘ్నేశ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు ఇద్దరిని అభినందిస్తున్నారు. కవలలిద్దరూ మగ పిల్లలేనని విఘ్నేశ్ ప్రకటించారు. ప్రస్తుతం తమ చిన్నారులను పరిచయం చేస్తూ.. నయన్- విఘ్నేశ్ దిగిన ఫొటోలు షోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జూన్ 9న మహాబలిపురంలో నయనతార- విఘ్నేశ్ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి దేశంలోని ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. వివాహం అనంతరం నయన్- విఘ్నేశ్ థాయ్‌లాండ్‌లో హనీమూన్‌ను ఎంజాయ్ చేశారు.
నయనతార ఇటీవల విడుదలైన చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. సినిమాలోని నయనతార పాత్రకు మంచి గుర్తింపు లభించింది.