
award
ఆంధ్రప్రదేశ్లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. పార్వతీపురం జిల్లా రాజాం మండలంలోని కంచరం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన ‘రోగ నిరోధకశక్తిని పెంచే చిరుధాన్యాల పొడి’ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచారు కంచరం విద్యార్థులు.
కొత్త ఆవిష్కణలను ప్రోత్సహించేందుకు కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను అందజేస్తోంది. కంచరం విద్యార్థులు తమ ప్రాజెక్టును సెప్టెంబర్ ఒకటో తేదీన విద్యార్థులు ఆన్లైన్లో అవార్డు కమిటీకి పంపించారు. ఈ క్రమంలో ప్రాజెక్టు జాతీయ స్థాయిలో నాలుగో స్థానం దక్కినట్లు గైడ్ టీచర్ వేణుగోపాల్ వెల్లడించారు.
ప్రాజెక్ట్ సిద్ధం చేసిన పి.ఝాన్సీ, ఎస్.లయ రూ.20 వేల నగదు పురస్కారంతోపాటు ప్రశంసాపత్రాన్ని సెప్టెంబరు నెలాఖరున జరగనున్న కార్యక్రమంలో అందుకోనున్నారు.