
mobile app
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు, నాణ్యమైన వైద్యం అందించే దిశగా కృషి చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ, వాటి పర్యవేక్షణ కోసం అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా యాప్ ద్వారా సేవలను పర్యవేక్షించనుంది. ఇందులో భాగంగానే ‘ఏపీ హెల్త్ సెకండరీ కేర్ యాప్’ను ఏపీ వైద్య విధాన పరిషత్ రూపొందించింది.
యాప్ సాయంతో హాస్పిటల్స్‌లో శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్, బయో మెడికల్ పరికరాల నిర్వహణ వంటి అంశాలను మానిటర్ చేస్తుంది. ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న 175 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 53 ఏరియా హాస్పిటల్స్, 17జిల్లా హాస్పిటల్స్, రెండు ఎంసీహెచ్, ఒక చెస్ట్ డిసీజెస్ హస్పిటల్‌ను మానిటర్ చేస్తుంటుంది. 16వేల 340 పడకల సామర్థ్యముండగా లోటు లేకుండా చూడటమే లక్ష్యంగా పెట్టుకుంది.
యాప్‌లో ప్రతి హాస్పిటల్‌కు ఒక లాగిన్‌ను ఏర్పాటు చేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ లేదా ఆర్ఎంఓ యాప్‌లోకి లాగిన్ అయి వివరాలను నమోదు చేయాలి.
యాప్‌లో వివరాలను రాష్ట్ర డ్యాష్‌బోర్డుకు అనుసంధానం చేయడం వల్ల సెక్యూరిటీ, శానిటేషన్ ఇతర అంశాల్లో నిర్వహణ లోపాలను వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా యాప్‌ను తీసుకువచ్చినట్లు ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ – డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.
హాస్పిటల్స్‌లో భద్రతను మరింత పెంచేలా సెక్యూరిటీ గార్డ్ అందుబాటులో ఉన్నాడా అని తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్ ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ విజిట్ మాడ్యుల్లో గార్డ్ 24గంటలు అందుబాటులో ఉంటున్నాడా అనే దానికి ఎస్ లేదా నో అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఎస్ అనే ఆప్షన్ ఎంచుకుంటే వెంటనే లైవ్ ఫొటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఫొటోను తీసి లైవ్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
హాస్పిటల్లో సెక్యూరిటీ విధానం, సెక్యూరిటీ సిబ్బంది పనితీరు, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ తదితర అంశాలను ఎలా హ్యాండిల్ చేస్తున్నారనే స్కోరింగ్‌ను బట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని వినోద్ కుమార్ వెల్లడించారు.