
తెలంగాణ పర్యావరణ శాఖ మంత్రి కోండ సురేఖ, నటి సమంత నాగ చైతన్య విడాకులకు తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కారణమని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం సమంత సహా అనేక వర్గాల నుండి భారీ వ్యతిరేకత వచ్చింది. ‘ఎక్స్’ వేదికగా మంత్రి సురేఖ తన వ్యాఖలని వెనక్కి తీసుకుంటూ, క్షమాపణ చెప్పారు
తానూ చేసిన వ్యాఖ్యలు సమంత మనోభావాలను గాయపరచడానికి ఉద్దేశించబడినవి కావని, మహిళలపై రాజకీయ దాడుల్ని ప్రశ్నించడానికి మాత్రమేనని స్పష్టం చేసారు
తన పోస్టులో, మంత్రి సమంతను గౌరవిస్తూ, సమంత స్వయం కృషితో పైకి వచ్చారని తన పట్టుదల ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షేమించమని, వారికి హృదయ పూర్వక క్షమాపణలు కోరుతు తన వ్యాఖ్యలను ఉపసంహరించినట్లు తెలియజేసారు
సమంత-నాగ చైతన్య విడాకుల వివాదం
ఈ వివాదం, కోండ సురేఖ భారత రాష్ట్ర సమితి కార్యదర్శి అయిన కేటీఆర్ కి ముడి వేస్తూ చేసిన వ్యాఖల వల్ల మొదలయ్యింది.కేటీఆర్ తన మంత్రిగా ఉన్న సమయంలో సమంత సహా పలు నటి నటుల వ్యక్తిగత సంభాషణలను ఫోన్ టాపింగ్ చేసి, బ్లాక్మెయిల్ చేసేవాడని ఆరోపించారు. కేటీఆర్ సమంత, నాగ చైతన్య వివాహం విడాకుల దాకా వెళ్లిందంటే దానికి కేటీఆర్ పరోక్షంగా భాగస్వామి అని అర్ధం వచ్చేలా ఎవ్వరు ఊహించని సంచలన వ్యాఖలు చేసారు మంత్రి
ఇదే విషయంపై మీడియాతో మాట్లాడుతూ, మంత్రి సురేఖ ఇలా అన్నారు: “సమంత విడాకులు అవ్వడానికి కారణం కేటీఆర్. మంత్రిగా ఉన్న సమయంలో అతను నటి నటుల సంభాషణలు ఫోన్ టాప్ చేసి, వారి బలహీనతలను కనుగొని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఆలా వారిని మత్తు బానిసలని చేసేవాడు. ఇది జరిగిందని అక్కినేని కుటుంబంతా తెలుసు సమంత, నాగ చైతన్య, నాగార్జున అందరికీ తెలుసు” అని అన్నారు
సమంత ఘాటుగా స్పందించారు
ఆమె వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలో మరియు రాజకీయ వర్గాలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేసి, ఆమె పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు
మంత్రి సురేఖ వ్యాఖ్యలకు సమంత సోషల్ మీడియాలో స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనలో, సమంత మంత్రి వ్యాఖ్యలతో నిరాశకు గురయ్యానని తెలిపింది. గ్లామర్ ఇండస్ట్రీలో ఒక మహిళగా ఎదుర్కొనే సవాళ్లను గుర్తు చేస్తూ, అక్కడ మహిళలను తరచుగా వస్తువులా పరిగణిస్తారని చెప్పింది. ప్రేమ, నిరాశ, మరియు తన వ్యక్తిగత జీవితంపై జరిగిన బహిరంగ విమర్శలను ఎదుర్కొనడానికి ఎంత ధైర్యం కావాలో సమంత తన ప్రకటనలో ప్రస్తావించారు
తనకు నాగ చైతన్య మధ్య జరిగిన విడాకులు పరస్పర సమ్మతంతో, గౌరవపూర్వకంగా పరిష్కరించబడ్డాయన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఆమె తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన పుకార్లను, వక్రీకరణలను తీవ్రంగా ఖండించారు. తమ విడాకులలో ఎలాంటి రాజకీయ ప్రభావం లేదని మరోసారి స్పష్టం చేశారు. సమంత మంత్రి సురేఖను తన గోప్యతను గౌరవించాలని, రాజకీయ వివాదాలలో తన పేరును లాగకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండటం మాత్రమే కాక, తన జీవితాన్ని రాజకీయ లీడర్ల దృష్టికి దూరంగా కొనసాగించాలనుకుంటున్నారని వివరించారు
నాగ చైతన్య కుటుంబం, ముఖ్యంగా ఆయన తండ్రి, సీనియర్ నటుడు నాగార్జున, ఆయన సవతి తల్లి అమలా అక్కినేని కూడా కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే ప్రజా వ్యక్తులుగా, వారి వ్యక్తిగత జీవితాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు
ఐతే ఈ విషయంలో కేటీఆర్ కి మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు, మరి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి